![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -61 లో......గంగ పుట్టినరోజు కాబట్టి రుద్ర తనని షాపింగ్ మాల్ కి తీసుకొని వెళ్లి డ్రెస్ తీసుకొమ్మంటాడు. గంగ తక్కువ ధర గల డ్రెస్ ని సెలెక్ట్ చేసుకుంటుంది. రుద్ర వేరొకవైపు వెళ్తాడు. అక్కడున్న వాళ్ళు గంగ చీప్ గా సెలెక్ట్ చేసుకుంటుందంటూ నవ్వుకుంటారు. అది రుద్ర విని గంగ దగ్గరికి వస్తాడు.
గంగకి డ్రెస్ సెలెక్ట్ చేస్తాడు. రుద్ర ఏం చూపించినా కూడా బాగున్నాయంటూ చెప్తుంది. ఏంటి అన్నీ బాగున్నాయంటున్నావ్.. నీకంటు ఒపీనియన్ లేదా అని రుద్ర అంటాడు. ఇవి ట్రైయల్ వేసి చూసుకోమని రుద్ర అంటాడు. నాకు ట్రయల్ రూమ్ ఎక్కడో తెలియదని గంగ చెయ్ పట్టుకొని రుద్ర తీసుకొని వెళ్తాడు. దాంతో గంగ హ్యాపీగా ఫీల్ అవుతుంది.
గంగ లోపలికి వెళ్ళబోతుంటే లోపలున్న సైదులు ఫోన్ రింగ్ అవుతుంది. అప్పటికే రుద్రకి డౌట్ వచ్చి గంగని ఆగమంటాడు. గంగ ఇప్పుడు వెళ్ళమని లోపలున్న వాళ్ళకి వినపడేలా అంటుంటే.. గంగని వెనక్కి వెళ్ళమని సైగ చేస్తాడు. రుద్ర డోర్ ఓపెన్ చేయగానే గంగ అనుకొని సైదులు కత్తితో ఎటక్ చేయబోతుంటే.. రుద్ర ఆపుతాడు. సైదులుని పట్టుకోవాలని చూస్తే అతను పారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |